Header Banner

జియో థింగ్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్యూర్ ఈవీ.. ఎలక్ట్రిక్ వాహన రంగంలో కీలక మార్పు..

  Tue Feb 18, 2025 16:32        Auto

భారత్‌లో ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ(Pure EV), జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చెందిన జియో థింగ్స్( JioThings) లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్యూర్ ఈవీ తమ ఎలక్ట్రిక్ వాహనాల్లో జియో థింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లు, టెలీమ్యాటిక్స్‌ ఫీచర్లను అందిస్తారు. ఈ టెక్నాలజీ ఫీచర్ల ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడంతోపాటు, ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సేవలను ఉపయోగించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ప్యూర్ ఈవీ తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పనితీరు, ఇంటరాక్టివిటీని మెరుగుపరచుకునేందుకు జియోథింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లను అనుసంధానిస్తున్నట్లు తెలిపింది. దీంతో 4జీ కనెక్టివిటీ ఆధారిత టెలీమ్యాటిక్స్ ద్వారా వినియోగదారులు రియల్ టైమ్‌లో వాహన పనితీరును పర్యవేక్షించుకోవచ్చు. తద్వారా వారు మరింత మెరుగైన సౌకర్యాన్ని పొందుతారు. ప్రస్తుతం జియోథింగ్స్ 4జీ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP) ఆధారిత AvniOSను ఉపయోగిస్తుంది.

 

ఇది కూడా చదవండి: కారులో ఏసీ వాడితే ఫ్యూయల్ అయిపోతుందా? ఇలా ఏసీ లేకుండా కార్ కూలింగ్ చేయండి!

 

ఇది వినియోగదారులకు రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, ద్విచక్ర వాహన ఇంటర్‌ఫేస్ కస్టమైజేషన్, ఫుల్ హెచ్‌డీ+ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, కంపాటిబిలిటీ వంటి అనేక సౌకర్యాలను అందిస్తుంది. ఈ డిజిటల్ క్లస్టర్ ఓఈఎంలు తమ ఉత్పత్తుల్లో ఐవోటీ సొల్యూషన్స్‌ను అనుసంధానించడానికి వేగవంతమైన ప్రక్రియను అందిస్తాయి. జియో ఆటోమోటివ్ యాప్ సూట్ (JAAS) అనేది వాహనాల్లో అనుసంధానించబడిన మరొక సొల్యూషన్. ఇది ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల యూజర్ల కోసం రూపొందించబడింది. ఇందులో జియోస్టోర్, మ్యూజిక్ స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెన్స్, నేవిగేషన్, గేమింగ్ వంటి అనేక ఉత్పత్తులు, సొల్యూషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జియోథింగ్స్ ఐవోటీ సామర్థ్యాలను మా వాహనాల్లో పొందుపర్చడం ద్వారా ప్యూర్ ఈవీ ఉత్పత్తులు అత్యుత్తమ ప్రమాణాలతో మారుతాయని ఈ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ Dr. నిశాంత్ దొంగారి తెలిపారు. ఈ క్రమంలో మా వాహనాల సామర్థ్యాలు, ఇంటరాక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీ, మంచి పనితీరు, సౌలభ్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు నిశాంత్ దొంగారి స్పష్టం చేశారు.

 

ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త ఆవిష్కరణలతోపాటు, మంచి ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో ప్యూర్ ఈవీతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరమైన విషయమని జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆశీష్ లోధా తెలిపారు. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంతోపాటు పర్యావరణ అనుకూల రవాణా వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు తోడ్పడనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #News #EstatePlanning